ఈరోజు జరిగిన కేంద్ర క్యాబినెట్ అత్యవసర సమావేశంలో దేశవ్యాప్త కుల గణనకు ఆమోదం తెలిపినారు. భారతదేశంలో 1881-1931 సంవత్సరాల మధ్యకాలంలో బ్రిటిష్ పరిపాలనలో ప్రతి 10 సంవత్సరాలకు సామాజిక అంశాలు మరియు వారి వృత్తులు ఆధారంగా ఈ యొక్క కుల గణన అనేది జరిగేది, 1947వ సంవత్సరం స్వాతంత్రం పొందిన తరువాత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1951 లో కులగనను పూర్తిగా నిషేదించినారు. కానీ 1961 లో రాష్ట్రాలు వాటి పరిధిలో కుల గణనకు బదులుగా కుల సర్వేలకు మాత్రమే అనుమతించినారు. దీని కారణంగా సమాజంలో సామాజిక అసమానతలు పెరిగిపోయి, పలు రాష్ట్రాలలో కుల ప్రాతిపదిక రిజర్వేషన్ల డిమాండ్లు పెరిగిపోయాయి.
ఇకపై జరగబోయే దేశవ్యాప్త జనాభా లెక్కల నందు కులగనను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు, ఈ యొక్క సర్వే ద్వారా దేశంలో నెలకొన్న సామాజిక అసమానతలు తొలగించడానికి ప్రభుత్వాలకు వెసులుబాటు కలుగుతుంది. అంతేకాకుండా రిజర్వేషన్ లు కుల ప్రాతిపదికన కాకుండా సామాజిక ఆర్థిక వెనుకబాటు తనం ఆధారంగా మరి కొన్ని వెనుకబడిన కులాలకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్నది.