వాటికన్ సిటీ నందు మే 8న జరిగిన పోప్ ఏన్నిక ప్రక్రియలో కార్డినల్స్ జన్మతా అమెరికన్ అయిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్త్ ను ఏన్నుకున్నారు.
ఈయన 1955 వ సంవత్సరం సెప్టెంబర్ 14న అమెరికా, షికాగో లో జన్మించారు వీరి తల్లి పేరు ఆగ్నెస్ ప్రివోస్త్ తండ్రి పేరు లూయిస్ ప్రేవియస్ ప్రివోస్త్. వీరికి ఇద్దరు సోదరులు లూయిస్ మరియు జాన్, వీరి పూర్వీకులు స్పెయిన్ దేశస్తులు. వీరు మొట్ట మొదటి అమెరికన్ పోప్. ఈయన పెరూ దేశం నందు 2015 నుండి 2023వరకు బిషప్ గా చేశారు తరువాత 2023న కార్డినల్ అయ్యారు, అక్కడే ఆ దేశ పౌరసత్వం కూడా అందుకొన్నారు. వీరు కృత్రిమ మేధ కు పూర్తి వ్యతిరేఖులు దీని వల్ల ప్రపంచం అనేక అనర్ధాలను ఏధుర్కోవలసి వస్తుందని తెలిపేవారు అంతే కాకుండా సోషల్ మీడియా ను విరివిగా ఉపయోగించాలని తన సందేశంగా తెలిపేవారు. వీరు అమెరికా లో ఉన్న గన్ కల్చర్ పై మరియు అబార్షన్ లపై కూడా తరచుగా సోషల్ మీడియా ముఖంగా స్పందించే వారు.