ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పై విరుచుకు పడిన భారత వాయుసేన బలగాలు

Share Now

ఆపరేషన్ సింధూర్ పేరిట ఈరోజు వేకువ జామున సుమారుగా 3-4 గంటల మద్య సమయంలో భారత వాయు సేన బలగాలు పాకిస్తాన్ భూభాగం పై చొచ్చుకువెల్లి తొమ్మిది చోట్ల ఉగ్రవాద శిక్షణ శిబిరాలు మరియు ఉగ్రవాద సంస్థల కార్యాలయ భవనాలపై ప్రిసిషన్ బాంబులతో విరుచుకుపడ్డారు, ఈ ఆపరేషన్ మొత్తాన్ని 30 నిమిషాలలో పూర్తి చేసినట్టు వాయు సేన అధికారులు తెలిపారు. ఈ యొక్క దాడి మొత్తం పాకిస్తాన్ పౌరులు, సైనిక స్థావరాల లక్ష్యంగా కాకుండా తీవ్రవాదుల స్థావరాలు ఏరివేతే లక్ష్యంగా కొనసాగినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ మొత్తంలో జైష్-ఏ-మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా తదితర నిషేధిత తీవ్రవాద సంస్థల కేంద్రాలపై విరుచుకుపడిన భారత బలగాలు. ఈ దాడులతో ఉగ్రవాద సంస్ధలకు బారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు విస్వసనీయ వర్గాల సమాచారం.

భారత్ నుంచి పలువురు ప్రముఖులు, పలు రాజకీయ పార్టీలు దాడిలో పాల్గొన్న అధికారులను ప్రశంసించారు, అలాగే పలు దేశాదినేతలు ఈ దాడుల గురించిన సమాచారాన్ని విదేశాంగ శాఖ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుమూలంగా ముందు జాగ్రత్త చర్యలలో బాగంగా ఉత్తర భారత దేశం వ్యాప్తంగా పలు విమానాశ్రయాలను మే 10 వ తేదీ వరకు మూసివేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *