మే 13, హైదరాబాద్ ప్రపంచ గుర్తింపు అయిన చార్మినార్ వద్ద సందడి చేసిన ప్రపంచ సుందరులు. మే 13 నుంచి మే 31 వరకు హైదరాబాద్ నందు 72వ ప్రపంచ అందగత్తెల 2025 పోటీలు జరుగుతున్నాయి, ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాల నుండి వచ్చిన అందగత్తెలు పాల్గొను చున్నారు. ఇందులో బాగంగా సుందరీ మణులు చారిత్రాత్మక కట్టడం చార్మినార్ ను సందర్శించారు.
