నయనతార ఇక సినిమా ప్రమోషన్స్ కి రాదా…

Share Now

సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార .సినిమాలో నటిస్తే ..సినిమా ప్రమోషన్స్ కి కానీ ఆడియో వేడుకలకు కానీ రాదని చిత్ర పరిశ్రమ లో ఒక ప్రచారం ఉంది . ఇదివరలో చిరంజీవి పక్కన నటించిన సైర చిత్రం అప్పుడు కూడా ఇదే ప్రచారం జరిగింది, ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త అనిల్ రావిపూడి అనే ఒక దర్శకుడు ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నిర్మించనున్న చిరంజీవి చిత్రానికి అమెతో ఒక ప్రకటన లో నటింపచేసాడని , అదేదో గొప్ప కార్యక్రమం అయ్యినట్లు నేనే ఆ అమ్మాయి తో ప్రచారం చేయించానన్న బిల్డప్ ఇతర నిర్మాతలను కించపరిచే విధంగా సదరు దర్శకుడి ప్రచారం. కానీ ఇది వరలో నిర్మాతలు పి.జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కేవలం తమిళ అయ్యా అనే చిత్రాన్ని తెలుగులో పీద్ధాయన పేరుతో అనువాదం చేయ గా ఆ చిత్ర ఆడియో లాంచ్ హైదరాబాద్ లో జరిగితే నయనతార హాజరయ్యారు . మనుషులకు ఉన్న విలువలను బట్టి, మంచితనం బట్టి నయనతార ఫంక్షన్స్ లో హాజరు అవ్వుతుందని తెలుపుటకు పై డబ్బింగ్ చిత్రం ఆడియో రిలీజ్ సందర్భంగా తీసిన ఫోటో నిదర్శనం. కాబట్టి నయనతార కు తలభిరుసు అనే విధానం నాకు నిర్మాత లు స్వస్తి పలకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *