తమిళనాడు రాష్ట్రం నుంచి జూలై 25వ తేదీతో ఖాళీ కాబోతున్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల కాల పరిమితి, వారు అన్బుమని రామదాస్, M. షణ్ముగం, N. చంద్రశేఖరన్, M. మహమ్మద్ అబ్దుల్లా, P. విల్సన్, వైగో తదితరులు. దీనికి ఎలక్షన్ కమిషన్ వారు జూలై 19, 2025 న రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ జరుప తలపెట్టినారు. DMK పార్టీ తన నలుగురు అభ్యర్థుల జాబితాను ఈ రోజు ప్రకటించడం జరిగినది. అందులో మక్కల్ నీధి మయమ్(MNM) వ్యవస్ధాపకుడు అయిన దక్షిణ భారత చలనచిత్ర రంగం ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారి పేరును ఖరారు చేయడం జరిగింది వీరితో పాటుగా ప్రసిద్ధ రచయిత్రి సల్మా గారిని, పార్టీ సీనియర్ నాయకులు SR. శివలింగం మరియు సీనియర్ న్యాయవాది అలాగే ప్రస్తుత రాజ్యసభ సభ్యులు అయినటువంటి పి. విల్సన్ గారిని DMK పార్టీ ప్రకటించడం జరిగినది. దీనితో రాజ్యసభలో తమ గళం వినిపించడానికి సినిమాల నుండి న్యాయ వ్యవస్థ నుండి అలాగే ఒక రచయిత్రి ని రాజ్యసభకు పంపించడం జరిగినది.