కూటమి ఏడాది పాలనపై వైకాపా పార్టీ తలపెట్టిన బాబు వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అని పార్టీ శ్రేణులు జోష్. ఏన్నికల హామీలో బాగంగా NDA కూటమి మేనిఫెస్టో లో పొందుపరచిన సూపర్ సిక్స్ పధకాలు ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తైనా అమలుకాక పోవడంపై వైకాపా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా పార్టీ దాని అనుభంద సంస్ధలు పాల్గొన్నాయి. మన్యం జిల్లా పార్వతీపురం నందు అత్యదిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్బంధంలో ఉంచిన పోలీసులు, గరివిడి సభలో ప్రసంగిస్తుండగా బొత్స సత్యన్నారాయణ గారికి స్వల్ప అస్వస్తతకు లోనైనారు వారిని హుటాహుటిన వైద్యశాలకు తరలించారు, నగరిలో RK రోజా తనదైన శైలిలో విన్నూత్నంగా చెవిలో పూలతో నిరసన తెలిపారు. వెన్నుపోటు దినాన్ని ప్రజల్లోకి తీసుకొని వెల్లి సక్సెస్ చేసినందుకు పార్టీ శ్రేనులకు, నాయకులకు జగన్ అభినంధనలు తెలిపినారు.