మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మొత్తానికి అదికార పార్టీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేసిందా? అంటే యస్ అనే లా జనంలో స్పందన చూస్తుంటే తేట తెల్లమౌతోంది. మైనింగ్ కేసులో అరెష్టైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ని జైలులో పరామర్శించను మరియు టిడిపి కార్యకర్తల దాడిలో ఇల్లు ధ్వంశమైన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని పరామర్శించను నెల్లూరు విచ్చేసిన జగన్ మోహన్ రెడ్డి కి నెల్లూరు జిల్లాలో ప్రజాదరణ చెక్కు చెదర లేదనే నిజం ప్రస్పుటమైంది. అదికార పార్టీ నేతలు పోలీసులను అడ్డు పెట్టి ఏన్నో అడ్డంకులు సృష్టించినా, ఇతర జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించినా ప్రజలు ఏమాత్రం లెక్క చేయలేదనేది నెల్లూరు పర్యటనతో అర్దం అయింది. కాకాని గోవర్ధన్ రెడ్డిని జిల్లా జైలు నందు కాకాని కుమార్తె శ్రీమతి కాకాని పూజితతో సహా ఇతర ముఖ్యనేతలతో కలిసి జైలులో పరామర్శించారు అలాగే నల్లపరెడ్డి ప్రసన్న ఇంట ఇతర నేతలతో కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నెల్లూరు పర్యటనలో పోలీసుల ఓవర్ ఏక్షన్ తారా స్ధాయికి చేరిందనే విమర్శలు పోలీసు శాఖపై వెల్లువెత్తుతున్నాయి. పలువురు కార్యకర్తలను చెదరగొట్టను లాఠీ గులిపించారనే కార్యకర్తలు తీవ్ర మనో వేదనకు లోనైనారు, అలాగే మానవ హక్కుల సంఘానికి పోలీసు శాఖ తీరుపై పిర్యాధు చేయాలని పలువురు వైకాపా పార్టీ కార్యకర్తలు వైకాపా న్యాయ విభాగాన్ని కోరుతున్నారు.
