ఏట్టకేలకు మంజునాధ పుణ్యక్షేత్ర, ధర్మస్ధలి ఉదంతంపై తెరతీసిన సిట్ అధికారులు, C.A చిన్నయ్య అనే మాజీ పారిశుధ్య కార్మీక దేవస్ధాన ఉధ్యోగి చేసిన ఆరోపణల నేపద్యంలో ఏర్పాటైన కర్ణాటక రాష్ట్ర సిట్ ధర్యాప్తు సంస్ధ చిన్నయ్యను అదుపులోకి తిసుకున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఆలయ ప్రతిష్టతను దెబ్బతీయను ఆరోపణలు చేసినట్లు నిందితుడుపై అబియోగాలు మోపారు. అసలు కధనం గత 20 ఏల్లుగా ధర్మస్ధలి లో 100 పైగా మహిలలు, పిల్లలు మాయమైనట్లు వీరిపై హత్యాచారం జరిగినట్లు వీరిని తన హస్తాలతో పలు ప్రదేశాలలో పూడ్చిపెట్టినట్లు గత కొద్దికాలంగా ఈ సంఘటనలపై త్రీవ్రమైన మనోవేదనతో పోలీసు కంప్లైంట్ చేశారు. దీనితో ఓక్క సారిగా ఉలిక్కిపడ్డ యంత్రాగం ప్రత్యేక ధర్యాప్తు విభాగాన్ని కర్ణాటకా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు నిందితుడు తెలిపిన 17 చోట్ల త్రవ్వకాలు జరుపగా అందులో రెండు చోట్ల మాత్రమే మానవ అవశేషాలు అదీ పొంతన లేని విదంగా దొరకడంతో సిట్ అదికారులు సదరు చిన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్ర ప్రతిష్టకు భంగంకలిగించేలా మరియు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆరోపణలు చేసిన నేపద్యంలో దీనిలో ఏదైనా కుట్రకోణం దాగివుందా ఆనే దానిపై నిందితుడిని జ్యుడిషియల్ కష్టడీలో విచారణ జరపనున్నట్లు సిట్ అధికారులు తెలియజేశారు.