తెలంగాణలో పేద, మధ్యతరగతి పిల్లలకు
అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలననే సంకల్పంతో సిఏం రేవంత్ రెడ్డి. విధ్యా విధానం లో సమూల మార్పులు, ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం.
ప్రతిపాదిత నూతన విద్యా పాలసీ కేవలం విద్యా వ్యవస్థలో మార్పు తేవడం మాత్రమే కాకుండా, పేదరిక నిర్మూలన సాధించేలా దిశగా అడుగులు వేయాలని సంకల్పం. విద్యారంగంలో గతంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లు కీలక పాత్ర పోషించాయి. ఏడాదికి 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతుంటే వారి లో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు, నాణ్యత, నైపుణ్యత కొరవడటం సమస్యకు కారణం అని. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం అని ముఖ్యమంత్రి నొక్కానించారు. విద్యా విధానం లో సమూల మార్పులు తీసుకురావడమే నా ధ్యేయం అని నూతన విద్యా పాలసీ ఆ దిశగా రూపకల్పన జరగాలి అదికారులను కోరారు. మేధావులు, విద్యాధికుల నుండి సూచనలు, సలహాలు తీసుకుని కొత్త పాలసీ రూపొందించాలి అని అధికారులకు సూచించారు. ఈ పాలసీ దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థకు ఆదర్శంగా రూపొందాలని, 73 లక్షల మంది యువత కు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా యొక్క తపన అని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
ఒకటి నుంచి 12వ తరగతుల వరకు సమూల మార్పులు రావాలని, విద్య విషయం లో సమాజానికి మేలు జరుగుతుందంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఎంఎల్సీ ప్రో. శ్రీ కోదండరాం గారు, శ్రీ కె కేశవ రావు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, శ్రీ ఆకునూరి మురళి, శ్రీ శ్రీపాల్ రెడ్డి, శ్రీ ఏవీఎన్ రెడ్డి, శ్రీ మల్క కొమరయ్య మరియు పలువురు విద్యావేత్తలు, అన్ని యూనివర్సిటీ ల వైస్ చాన్సలర్స్ లు, ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీమతి యోగితా రాణా, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ శ్రీ బాల కిష్టా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.