అగ్నికి ఆహుతి అయిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

Share Now

హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది ఇందులో 42 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు వీరిలో 12 మంది సురక్షితంగా బయటపడ్డారు, మిగతా 25 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, ఇంకొక 5 మంది క్షతగాత్రులు ప్రయాణికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారు.
కర్నూలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిన్న టేకూరు గ్రామం, కర్నూలు జిల్లా నందు రాత్రి 1:30 గంటలకు ఘోర అగ్ని ప్రమాదానికి గురి అయినది, ప్రమాదానికి గల కారణాలు బస్సు వెనుక భాగంలో ఒక ద్విచక్ర వాహనదారుడు అతివేగంగా వచ్చి బస్సు వెనుక వైపునున్న ఇంధన ట్యాంకును ఢీ కొట్టారు, దీనితో ఇంధన ట్యాంక్ నుండి లీక్ అయిన ఇంధనం ద్వారా వెనువెంటనే త్వరితగతిన మంటలు వ్యాపించాయి దీని కారణంగా బస్సు పూర్తిగా బస్మీపటలమైనది. సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే కావడంతో ఇందులో బాధితులు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు, అలాగే దుర్ఘటనపై కేసు కట్టి దీనిపై ఏదైనా ఇతరత్రా కోణాలు ఉన్నాయా అనే సందేహంపై దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *