గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కుత్భుల్లాపూర్ మరియు గాజులరామారం పరిధిలో గల పట్టణ పొదుపు సమాఖ్యలలో భారీగా అవకతవకలు జరిగినట్లు పలువురు మహిలలు ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం లో ఫిర్యాదు.
2017 న కుత్భుల్లాపూర్ పట్టణ పొదుపు సమాఖ్య నుండి విడిపోయి ఏర్పాటైన గాజులరామారం సర్కిల్ పరిధి లోగల పట్టణ పొదుపు సమాఖ్య నందు 10 లక్షల రూపాయలు వరకూ నిధులు గోల్మాల్ జరిగినది. పట్టణ సమాఖ్య నుండి ఇతర వ్యక్తులకు లోన్ ల మంజూరు, అలాగే నిబంధనలకు వ్యతిరేకంగా TLF నిర్వహణ, ప్రతి సంవత్సరం సమాఖ్య సభ్యులకు లాభ, నష్టాల వివరణ ఇవ్వకపోవడం, జవాబుదారీ తనం లేకపోవడంతో ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమంలో పలువురు సమాఖ్య సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగినది. ఇది ఈ ఓక్క పట్టణ సమాఖ్య లోనేనా ఇలా నిదుల ధుర్వినియోగం జరిగిందా లేదా రాష్ట్ర వ్యాప్తంగా గల పలు ఇతర పట్టణ మరియు గ్రామీణ మండల, జిల్లా సమాఖ్యలలో కూడా ఇలాంటి దుర్వినియోగం గత ప్రభుత్వ కాలంలో జరిగిందా అనే దానిపై పూర్తి విచారణ జరపి పేద, బడుగు పొదుపు మహిలల సొమ్ములకు ప్రభుత్వం భరోసా కల్పించాలి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా బావించే పొదుపు మహిలల పలు సమస్యలపై కూడా త్వరిత గతిన స్పందించాలని కోరుతున్నారు.