అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘జనాభా నిర్వహణ విధానం – 2026’ (Draft Population Management Policy) రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చకు దారితీసింది. పడిపోతున్న సంతానోత్పత్తి రేటును (TFR) అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 25,000 నగదు ప్రోత్సాహకం, ఉచిత విద్య వంటి ఆఫర్లు ఎంతవరకు సత్ఫలితాలనిస్తాయి అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రభుత్వాలు చేసే అప్పుల కారణంగాను మరియు విద్య-వైద్య విపరీత ఖర్చుల కారణంగాను అదీ ముఖ్యంగా మద్యతరగతి ప్రజలపై ఆర్ధిక పెను భారం తో ఓక్క సంతానంతో నే సరిపెడుతున్న ప్రజలు, దరిమిలా రాష్ట్రంలో తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు.
జపాన్, దక్షిణ కొరియా అనుభవాలు ఏం చెబుతున్నాయి?
ప్రభుత్వం తన విధానంలో జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలను ఉదాహరణగా పేర్కొంది. అయితే, ఆ దేశాల్లో దశాబ్దాలుగా ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించినప్పటికీ జననాల రేటు పెరగకపోగా, రికార్డు స్థాయిలో పడిపోయింది. దీనికి ప్రధాన కారణం కేవలం నగదు లేకపోవడం కాదు, పెరిగిన జీవన ప్రమాణాల వ్యయం.
అసలు సమస్య ఎక్కడ?
మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు వెనకడుగు వేయడానికి ప్రధాన కారణాలు ఇవే:
- విద్యా ఖర్చులు: నాణ్యమైన విద్య అనేది సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఏటా ఆకాశాన్ని తాకుతున్నాయి.
- ఆరోగ్య సంరక్షణ: వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారింది. డెలివరీ నుంచి పిల్లల టీకాల వరకు అయ్యే ఖర్చు సామాన్యుడికి భారంగా మారుతోంది.
- నివాస స్థలాలు: పట్టణీకరణ పెరగడంతో గృహాల ధరలు, అద్దెలు విపరీతంగా పెరిగాయి. చిన్న ఇళ్లలో పెద్ద కుటుంబాలను పోషించడం కష్టతరమవుతోంది.
- ఉద్యోగ భద్రత: భార్యాభర్తలిద్దరూ పనిచేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి. ఇలాంటి సమయంలో పిల్లల పెంపకానికి సమయం కేటాయించడం సవాలుగా మారింది.
ప్రభుత్వ ప్రతిపాదనలు – ఒక చూపు
ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా పాలసీలో కొన్ని కీలక అంశాలు:
- ఆర్థిక సాయం: మూడో సంతానానికి రూ. 25,000 నగదు ప్రోత్సాహకం.
- పోషణ-శిక్ష-సురక్ష: ఐదేళ్ల పాటు నెలకు రూ. 1,000 సాయం మరియు 18 ఏళ్ల వరకు ఉచిత విద్య.
- సెలవులు: తల్లులకు 12 నెలల ప్రసూతి సెలవులు, తండ్రులకు 2 నెలల పితృత్వ సెలవులు.
- ఎన్నికల నిబంధనలు: భవిష్యత్తులో ఇద్దరి కంటే తక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించే యోచన.
దీనిపై మాజీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయి రెడ్డి తనదైన శైలిలో రాష్ట్రంలో పెరిగిపోతున్న జీవన వ్యయాల(Cost of Living) కారణంగా మాత్రమే ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు ఘణనీయంగా పడిపోతున్నట్లు ఆయన తన ఏక్స్ వేధికగా ప్రభుత్వాన్ని ఏద్దేవా చేశారు.