నెల్లూరు: ఇంధ్రప్రస్ధ లేఔట్, పేడూరు గ్రామం, తోటపల్లి గూడూరు మండలంలో 17 మంది రైతులు కలసి, 28వేర్వేరు సర్వే నంబర్లలో గల 23.6ఏకరాల భూమిని గత వైకాపా ప్రభుత్వం సమయంలో 29 సెప్టెంబర్ 2023న, ల్యాండ్ సబ్ డివిజన్ లేకుండానే ఓకే లేఔట్ నంబరు పై 17 మంది రైతులూ లేఔట్ నంబర్ L.P.No. 37/2023/1105/T.P.Gudur నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ (NUDA) ద్వారా అనుమతి పొందారు. ఈ ఇంధ్రప్రస్ధా లేఔట్ నకు పొంగూరు శ్రీనివాస్ లేఔట్ డెవలపర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ యొక్క ఇంధ్రప్రస్ధ లేఔట్ నందు 12 సంవత్సరాల మైనర్ బాలిక పేరుతో గల సర్వే నంబర్ 39/1A లో ఉన్న 1 ఏకరాల గిఫ్ట్ డీడ్ భూమిని మైనర్ బాలల హక్కులను కాల రాసే విధంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటి(NUDA), అప్పటి NUDA వైస్ చైర్మన్ అయిన T.బాపిరెడ్డి గారు లే అవుట్ ను అప్రూవల్ చేశారు. అంతే కాకుండా నెల్లూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం అధికారులు ఈ లే ఔట్ నకు సంభందించిన ల్యాండ్ ప్రొసీడింగ్ ఫైల్ మిస్ అయినట్లు పౌర సమాచారం ద్వారా తెలిపి ఉన్నారు. రియాల్టర్లతో కుమ్మక్కై కావాలనే ఉద్దేశ పూర్వకంగా ఈ లేఔట్ కి సంబందించిన రెవెన్యూ రికార్డులు నాలా కన్వర్షన్ మరియు ప్రొసీడింగ్స్ ఫైల్ మిస్ చేశారా అనే దానిపై, అలాగే 12 సంవత్సరాల మైనర్ బాలిక పేరుపై లేఔట్ ను నూడా అదికారులు ఏలా అప్రూవల్ చేశారు అనేదానిపై కలెక్టర్ గారు సమగ్ర విచారణ జరపాలి.
లే ఔట్ పై మరియు లేఔట్ ఫైలింగ్ డాక్యుమెంట్లపై నూడా అదికారులను వివరణ అడుగగా ముఖం చాటేస్తున్న NUDA అధికారులు. దీనిని బట్టి గత ప్రభుత్వంలో NUDA అధికారులు ఏంతటి అదికార దుర్వినియోగానికి అంతులేని అవినీతికి పాల్పడ్డారు అనేది తేటతెల్లం అవుతోంది. కొత్త ప్రభుత్వంలో ఇలాంటి కుంభకోణాలపై ప్రత్యేక ధృష్టి సారించాలి కానీ టిడిపి ప్రభుత్వంలో కూడా కొందరు నాయకులు అప్పటి వైకాపా రియల్ మాఫియా కు కొమ్ము కాస్తున్నారు. ఆ టిడిపి నాయకులు ఏవరూ అనేదానిపై ప్రభుత్వ పెద్దలు ధృష్టిసారించాలి లేదంటే రాబోయే రోజులలో టిడిపి పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తఫ్పదు.
టిడిపి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే నెల్లూరులో వెలసిన ఇలాంటి బోగస్ లేఔట్లపై అలాగే ఈ లేఔట్లలో కింగ్ పిన్ గా వ్యవహరించిన వ్యక్తులపై విచారణ జరిపి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి లేదంటే NUDA ను నమ్మి ప్లాట్లు కొన్న మద్యతరగతి ప్రజలు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది, అంతే కాకుండా ప్రభుత్వం పై కూడా ప్రజలలో కొత్త సీసాలో పాత సారా పరిపాలన అనే నానుడి ప్రస్పుటం అవుతుంది. ఇకపై ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా వుండాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు NUDA సంస్ధపై ప్రత్యేక శ్రధ్ధ చూపి ఈ ఘటనపై CID విచారణకు ఆదేశించాలి.