విపిఆర్ నేత్రతో, చూపులేని కళ్ళకు వెలుగు

Share Now

చూపు మందగించిన కళ్ళకు కంటి వెలుగై, అభాగ్యులకు అండదండలై, ఆపద్బాంధవుడై ప్రజా సేవలో శిఖరసమానులైన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సతీమణి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు సోమవారం విడవలూరు మండలం లక్ష్మీపురం నుంచి విపిఆర్ నేత్ర రెండో బస్సు సేవలను ప్రారంభించగా.. భారీగా తరలివచ్చిన ప్రజలు తమ నిండు మనసుతో ఆశీసులు అందించి దీవించారు.

ముందుగా గ్రామానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు గ్రామస్తులు, మత్స్యకారులు, భారీ గజమాలతో స్వాగతం పలికారు. కర్పూర హారతులు పట్టి తమ అభిమాన నాయకులను ఆహ్వానించారు. అనంతరం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన విపిఆర్ నేత్ర బస్సును ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటిచూపు సరిగా లేని పలువురికి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేసి అక్కడికక్కడే కంటి అద్దాలు అందజేశారు. వృద్ధులు, మహిళలు, పెద్దవారు కంటి పరీక్షలు చేయించుకుని, ఇన్నాళ్లకు తమ చూపు స్పష్టంగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మురిసిపోయారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజును పురస్కరించుకుని విపిఆర్‌ నేత్ర 2 సేవలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఆయన పుట్టిన రోజుకు తమ కానుక అని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలపై అవగాహన లేక ఎంతో మంది తమ చూపును నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇప్పటికే గ్రామస్థులకు తాగడానికి నీరు, దివ్యాంగులు ఆత్మ ధైర్యంతో బతికేందుకు ట్రై సైకిల్స్, పేద పిల్లలు చదువుకునేందుకు విపిఆర్ విద్య వంటివి ఏర్పాటు చేశామన్నారు. ఇంకా ఏదో చేయాలన్న తపన నుంచి విపిఆర్ నేత్ర కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు.

మన శరీరంలో కళ్ళు అతి ముఖ్యమైనవని, కంటి చూపు లేకుంటే జీవితం అంధకారమేనన్నారు. మత్స్యకారులకు ప్రాధాన్యమిస్తూ ఇక్కడి నుంచి సేవలను ప్రారంభిస్తున్నామన్నారు. తటి ముఖ్యమైన నేత్రాలతో ఈ అందమైన ప్రపంచాన్ని చూపించేందుకు విపిఆర్ నేత్ర తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు చేయించుకుని అద్దాలు అందుకున్న వారితో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుకున్నారు.

సీఎం చంద్రబాబు లాంటి క్రమశిక్షణ గల వ్యక్తి పాలనలో పనిచేయడం గర్వంగా ఉందని, ఆయన చేసే దాంట్లో మనం 10 శాతం మాత్రమే చేస్తున్నామన్నారు. మంత్రి నారా లోకేష్ గారు కూడా సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. డిప్యటీ సీఎం ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన విపిఆర్‌ నేత్ర కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేశారని అన్నారు. త్వరలోనే మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందుతుందని, ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సీఎం చంద్రబాబు గారిని ఇదే ప్రాంతానికి ఆహ్వానిస్తామన్నారు. ఆయన్ను కోవూరు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఉదయగిరిలో ప్రారంభించిన బస్సు ద్వారా 7 మండలాల్లో 40 వేల మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రారంభించి ఆరు నెలలైనా ఇంకా ఒక్క నియోజకవర్గం పూర్తి కాలేదని, ప్రజలకు వేగంగా సేవ అందించేందుకు మరో బస్సునను తయారు చేయించి ఇక్కడి నుంచి ప్రారంభించామన్నారు. మొత్తం పార్లమెంట్‌ నియోజకవర్గాలు పూర్తయ్యే సరికి 4-5 ఏళ్లు పడుతుందన్న ఉద్దేశంతో మరో బస్సును తీసుకువచ్చామన్నారు. మత్స్యకారులకు అండగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఉంటారని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి దంపతులకు మత్స్యకారులు ధన్యవాదాలు తెలిపారు. తమ కంటి సమస్యలకు పరిష్కారం చూపిన వారికి జీవితాంతం రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా స్థానికంగా పొన్నపూడి పాటూరు వద్ద ఫిషింగ్‌ జెట్టీ ఏర్పాటు చేయాలని స్థానిక మత్స్యకారులు కోరగా ఎంపీ వేమిరెడ్డి స్పందిస్తూ ఇక్కడ ఫిషింగ్ జెట్టీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని అధికారుల బృందం కూడా ఇటీవల పరిశీలించినట్లు వెల్లడించారు. మత్స్యకారులకు ఎప్పుడూ అండగా ఉండేది కూటమి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ప్రశాంతమ్మ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *