పట్టణ స్థానిక సంస్థల్లోని (ULBs) స్వయం సహాయక బృందాల (SHG) సభ్యులతో జిల్లా/ఉత్పత్తి-నిర్దిష్ట ఉపాధి క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించిన పలు సంస్థలు/ఏజెన్సీలను మూల్యాంకనం చేయడానికి గౌరవనీయులైన మిషన్ డైరెక్టర్ శ్రీ. ఎన్. తేజ్ భరత్ గారు, ఐఏఎస్ అధ్యక్షతన పరిశీలనా కమిటీ సమావేశం ఈరోజు జరిగింది.
తాడేపల్లిలోని మెప్మా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో మొత్తం 18 ఏజెన్సీలు పాల్గొని, తమ క్లస్టర్ నమూనాలు, కార్యాచరణ వ్యూహాలు, ఆపరేషనల్ ఫ్రేమ్‌వర్క్‌లు, మరియు పెట్టుబడి ప్రణాళికలను కమిటీ ముందు సమగ్రంగా వివరించాయి. ఎస్‌హెచ్‌జీ మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది.
సమావేశానంతరం, సమర్పించిన ప్రణాళికలను మరింత లోతుగా అద్యయనం చేసి, క్షేత్రస్థాయి అమలు వ్యూహానికి అనుగుణంగా తుది నిర్ణయాలు తదుపరి దశల్లో తీసుకుంటామని మిషన్ డైరెక్టర్ శ్రీ. ఎన్. తేజ్ భరత్ ఐఏఎస్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పట్టణ పేదరిక నిర్మూలనకు మరియు మహిళా సాధికారతకు బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.