ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సింగపూర్ నాలుగు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిందని ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాబోయే ఐదేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జిఐసి) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం అని ఇది రాష్ట్రంలో యువతకు గుడ్ న్యూస్, జగన్ కు బ్యాడ్ న్యూస్ అని ఆయన అన్నారు. దీని ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల సాధన, బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే లక్ష్యంగా సింగపూర్ పర్యటన సాగింది అని అన్నారు. సింగపూర్ లో ఉన్న తెలుగువారు మాకు ఘన స్వాగతం పలికారు అన్నారు అలాగే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సింగపూర్ నుండి పెట్టుబడులు రాబోతున్నాయని ఈ సందర్భంగా మిడియా సమావేశంలో మంత్రి నారా లోకేష్ వివరించారు.