ఏట్టకేలకు ఉత్కంఠతకు తెరదించిన కాంగ్రేస్ పార్టీ అధిష్టానం, ప్రస్తుత బిహార్ శాసన సభ ఏన్నికలలో ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు తమ కూటమి అధికారంలోకి వస్తే యువకుడు అయిన తేజష్వీ యాదవ్ ను ముఖ్యమంత్రి ని చేయనున్నట్లు కాంగ్రేస్ పార్టీ బీహార్ రాష్ట్ర ఇన్చార్జ్ అశోక్ గెహ్లాట్ పాట్నా సభలో ప్రకటించారు. తేజష్వీ యాదవ్ గతంలో బీహార్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఈయన మాజీ కిర్కెటర్ కూడా మరియు మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారి చిన్న కుమారుడు, దీనితో ఇండియా కూటమి కి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఏవరు అని పదే పదే ప్రశ్నిస్తున్న NDA కూటమికి ధీటైన జవాబు చెప్పినట్లైంది. గత 20 సంవత్సరాల కాలంలో నితీష్ కుమార్ పరిపాలనలో బిహార్ రాష్ట్రానికి ఓరిగినది ఏమీ లేదని ఇండియా కూటమి నాయకులు ఏద్దేవా చేశారు. అదే విధంగా బిజెపి కూటమి మరలా అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి గా మరలా నితీష్ కుమార్ నే కొనసాగనున్నారు.