బకింగ్ హామ్ కెనాల్ భూముల హం ఫట్…

Share Now

సెప్టెంబర్ 27, బకింగ్హామ్ కాలువ పై జరుగుతున్న కబ్జాలు, కాలువ పరిదిలో గల మడ అడవులు, తాటిచెట్ల నరికివేత మరియు పలు ఆక్వా కంపెనీల డ్రెయిన్ వాటర్ ను బకింగ్ హామ్ కాలువలో కలుపడంపై ముత్తుకూరు మండలం, చలివేంద్రకు చెందిన S.వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి ఇచ్చిన పిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ రోజు మైపాడు గ్రామంలో పర్యటించి కాలువపై జరుగుతున్న కబ్జాలను అదికారులు పరిశీలించారు. అలాగే నిషేదిత CRZ పరిదిలో గల భకింగ్ హమ్ కెనాల్ భూముల ఆక్రమణపై పలువురు స్ధానికుల నుండి ఫిర్యాదులు సేకరించడం జరిగింది ఇందు వెంట నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి, అటవీ శాఖ అదికారులు, కాలుష్య నియంత్రణ మండలి అదికారులు అలాగే మత్స్యశాఖ అదికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *