రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ కసరత్తు

Share Now

భారత హోం మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం రేపు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో సివిల్ మాక్ డ్రిల్ చేయనున్నారు. ఇందులో అత్యవసర పరిస్థితులలో పౌరులు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే దానిపై కసరత్తు చేయనున్నారు. జిల్లా స్థాయిలో మరియు గ్రామ స్థాయిలో, హోంగార్డ్స్, NCC, NSS, వాలంటీర్లు మరియు కాలేజీ, స్కూల్ విద్యార్థులు పోలీసు సిబ్బంది మరియు భద్రతా దళ అధికారులు పాల్గొననున్నారు. యుద్ధ సమయంలో అత్యవసరంగా స్పందించవలసిన అంశాలపై అవగాహన కల్పించ నున్నారు.

  1. యుద్ద విమానాల ద్వారా దాడులు జరిగినప్పుడు ముందస్తు జాగ్రత్తగా తెలిపే ఎయిర్ సైరన్ సిస్టంపై అవగాహన కల్పించనున్నారు.
  2. యుద్ధ సమయంలో రాత్రిపూట విద్యుత్ దీపాలు నియంత్రణ ఎలా చేయాలి.
  3. అత్యవసర పరిస్థితులలో బంకర్లలో, గుహలలో లేదా సురక్షిత ప్రాంతాలలో ఎలా దాగాలి.
  4. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి.
  5. అత్యఇక పరిస్థితులలో వాడే హాట్ లైన్, హమ్ రేడియో వ్యవస్థలు గురించి అవగాహన.
  6. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స ఎలా అందించాలి, అగ్నిమాపక దళాల అప్రమత్తత, పవర్ బ్యాక్అప్ మొదలగునవి.

1971 తరువాత ఇప్పటివరకు భారతదేశం లో పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాలు లేని కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తత చేసే దిశగా ఈ యొక్క సివిల్ మాక్ డ్రిల్ చేయనున్నారు. యుద్ధ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఏమి చేయాలి అనే దానిపై ఇప్పటి జనరేషన్ ప్రజలకు అంత అవగాహన లేదు కనుక ఇందులో పూర్తిగా అనుభవం కలిగిన అధికారులు శిక్షణనిస్తారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *