ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో రాజ్యసభ ఉప ఎన్నికలు రచ్చ సృష్టిస్తున్నాయి. మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఒక్కొక్కరిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చారు. టీడీపీ సభ్యుడి విషయంలోనే పీఠముడి పడింది. సోమవారం తాడేపల్లిలో నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుతో డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికతో పాటు పలు అంశాలు వీరిపై చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి సానా సతీశ్ పేరును చంద్రబాబు ప్రతిపాదించినట్టుగా సమాచారం. ఆయన ఎంపికపై తన అభ్యంతరాలను పవన్ కళ్యాణ్ ఇదే సమయంలో కుండబద్దలు కొట్టినట్టుగా తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా గతంలో మీడియాలో అనేక కథనాలు ప్రసారం అయ్యాయని, అలాంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం సరికాదని కూడా పవన్ చెప్పినట్టుగా కూటమి నేతల మధ్య చర్చ సాగుతోంది. టీడీపీ నుంచి సాన సతీశ్ కాకుండా మరొకరికి అవకాశమిస్తేనే తాము మద్దతిస్తామని కూడా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పనట్టుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రియాక్షన్ తర్వాత చంద్రాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఒకవేళ పవన్ కళ్యాణ్ మాటను కాదని బాబు సానా సతీశ్ వైపే మొగ్గు చూపితే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ మొదలైంది