రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లోని పోలీస్ అవుట్‌పోస్ట్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అవుట్‌పోస్ట్‌లోని జనరల్ డైరీ, రిసెప్షన్ రిజిస్టర్లు, పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు మరియు ఎంక్వైరీ రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.విమానాశ్రయ భద్రత, ప్రయాణికుల సౌకర్యార్థం పోలీసుల పనితీరును సమీక్షించిన కమిషనర్, విధుల్లో మరింత సమర్థతను పెంచడానికి అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. సీపీ సజ్జనార్ గారు జారీ చేసిన ప్రధాన ఆదేశాలు, త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారం, ప్రతి పిటిషన్‌పై ఎంక్వైరీ అధికారులు సమగ్ర నివేదికలు రూపొందించాలని, బాధితుల ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర సమన్వయం తో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విమానాశ్రయాల ఎస్.హెచ్.ఓల సంప్రదింపు వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని, తద్వారా అంతర్రాష్ట్ర కేసుల్లో సమన్వయం సులభతరం అవుతుందని తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ కొరకు డ్రగ్స్ అక్రమ రవాణా మరియు ఇతర నేరాలను అరికట్టడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ప్రయాణికుల భద్రత కొరకు విమానాశ్రయంలో మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వారిపై, మహిళల పట్ల వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (BCAS) సమన్వయంతో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు.
పోలీస్ హెల్ప్ డెస్క్ తో ప్రయాణికులకు తక్షణ సహాయం అందించడానికి ఎరైవల్స్ (Arrivals) విభాగంలో ప్రత్యేక ‘పోలీస్ హెల్ప్ డెస్క్’ ఏర్పాటు చేయాలని సూచించారు.
పటిష్టమైన నిఘాతో పాత నేరస్థులు మరియు అంతర్రాష్ట్ర దొంగల వివరాలతో కూడిన డేటాబేస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆయన సూచనలు చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో శంషాబాద్ డిసిపి పి. రాజేష్, ఏసిపి శ్రీకాంత్ గౌడ్ మరియు ఇన్‌స్పెక్టర్ కనకయ్య సంపాతి తదితరులు పాల్గొన్నారు.