మధ్యప్రదేశ్ రాష్ట్రం, చింద్వారా జిల్లా నందు ఓక వైధ్యుడు ఇచ్చిన మందు వికటించడంతో మృత్యువాత పడ్డ 11 మంది చిన్నారులు. దీనితో అప్రమత్తమైన మధ్య ప్రదేశ్ యంత్రాంగం హుటాహుటిన సదరు డాక్టర్ పై అలాగే తమిలనాడు కు చెందిన ఔషద సంస్ద పై కేసు నమోదు చేశారు.
వివరాలు పరిశీలించగా చింద్వారా జిల్లా ప్రభుత్వ వైధ్యశాలలో చిన్నపిల్లల వైధ్యునిగా పనిచేసే డా. ప్రవీణ్ సోనీ అనే వైద్యుడు తను సొంతగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా నడుపుచున్నారు ఆయన తన ప్రైవేట్ వైద్యశాలలో గత కొంత కాలంగా పలువురు పిల్లలకు కోల్డ్రిఫ్ (Coldrif) అనే మందును రాశారు, ఈ మందుని తీసుకున్న పలువురు పిల్లలలో తీవ్రమైన జ్వరం, మూత్రాశయం సమస్యలు, మరియు మూత్ర సంభందిత సమస్యతో గత నెల రోజుల్లో 11మంది పిల్లలు అస్వస్తతతో మృత్యువాత పడ్డారు. దీనితో ఈ సంఘటన పై మద్యప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర ప్రత్యేక విచారణ జరిపి సధరు చిన్నపిల్లల వైద్యుడు ప్రవీణ్ సోని ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే డా. ప్రవీణ్ సోని ని ప్రభుత్వ విధుల నుండి కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చిన్ద్వారా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు తెలిపిన వివరాలు ప్రకారం ఈ ఘటనలో డా. ప్రవీణ్ సోనీ పై అలాగే కోల్డ్రిఫ్ తయారీ సంస్ధ అయిన తమిలనాడు రాష్టం, కాంచీపురానికి చెందిన శ్రీశాన్ ఫార్మాక్యూటికల్ అనే సంస్ధ పై భారత న్యాయ సంహిత సెక్షన్ 105, 276 మరియు 27 డ్రగ్స్ & కాస్మటిక్స్ యాక్ట్ పై FIR నమోదు చేసినట్లు తెలిపారు, అలాగే సదరు ఫార్మా సంస్ధను విచారించేందుకు DSP స్ధాయి అధికారి నేతృత్వంలోని ఓక భృందాన్ని తమిలనాడు రాష్రం పంపనున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ అజయ్ పాండే గారు తెలిపారు.