Gen Z ఉద్యమ పోరుతో తగలబడుతున్న నేపాల్

Share Now

Gen Z ఉద్యమం పోరుతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఖాట్మండు నగరం, గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు నేపాల్ దేశాన్ని కుదిపేస్తున్నాయి. నేపాల్ దేశంలో పెరిగిపోయిన అవినీతి మరియు బంధుప్రీతి కారణంగా దేశం ఆర్థిక దిగ్బంధనంలో కూరుకుపోయింది దీనిని పలువురు మేధావులు, ప్రజలు సోషల్ మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు, దీని కారణంగా ప్రభుత్వం పలు సోషల్ మీడియా వేదికలను బ్యాన్ చేయడం జరిగింది, దీనితో క్రోపో దిక్తులైన నేపాల్ యువత ఖాట్మండు నగరంలో ఉద్యమానికి పిలుపు నిచ్చారు. ఉద్యమం కాస్త చేయి దాటడంతో ఉద్యమకారులు నేపాల్ పార్లమెంటు భవనం, అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు భవనం, ప్రభుత్వ కార్యాలయాలను మరియు ఇతర ముఖ్య నాయకుల నివాసాలను తగులబెట్టడం మొదలు పెట్టారు అలాగే ప్రసిద్ధ హీల్టన్ హోటల్ ను బస్మీ పటలం చేశారు తదనంతర పరిణామాలతో నేపాల్ ప్రధాని K.P శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. అల్లర్ల కారణంగా ఇప్పటివరకు 30 మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు అలాగే 100కు పైగా క్షతగాత్రులు అయ్యారు. భారత ఉపఖండం లోని దాయాది దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాలలో రాజకీయ అస్థిరత మరియ అవినీతి, ద్రవయోల్బణం కారణంగా ఆ దేశ ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడడం గత కొంతకాలంగా చూస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *