ఉధ్యమం ఉధృతి ధృష్ట్యా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని రక్షణ కల్పించమని కోరిన అగర్వాల్ మహాసభ సంఘ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ అగర్వాల్. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ ఉధ్యమం గత కొద్ది రోజులుగా ఉధృతంగా నడుస్తోంది, దీనికి రాజకీయ రంగు పులమక పోయినా స్ధానిక తెలంగాణ వ్యాపారుల నుండి ఈ ఉధ్యమం మొదలైనది. మార్వాడీల వల్ల లోకల్ గా వ్యాపారాలు, ఉధ్యోగాలు కోల్పోతున్నామనేది స్ధానికుల వాదన. దీనితో ఈ ఉధ్యమం హింసాత్మకంగా మారుతుందేమో నని మహేష్ అగర్వాల్ గవర్నర్ గారికి తన లేఖ ద్వారా తెలిపారు. అలాగే మార్వాడీ కమ్యూనిటీ తెలంగాణా అభివృద్ది లో బాగమైందని, తరతరాలుగా మేము తెలంగాణా వారిగానే పరిగణించబడుతున్నామని కానీ ఈ వివక్ష కారణంగా వ్యాపారులలో భధ్రతపై అందోలనతో ఉన్నామని గవర్నర్ గారు జోక్యం చేసుకొని తగు చర్యలు మరియు రక్షణ కల్పించ వలసినదిగా కోరారు.