కడప జిల్లా లో జరిగిన వొంటిమిట్ట మరియు పులివెఅందుల బైపోల్స్ నందు హోరా హోరీగా సాగిన పోటీలో రెండు చోట్లా జడ్పిటిసి అభ్యర్ధులనూ టిడిపి కైవసం చేసుకుంది. ఈ పోటీలో వైకాపా పార్టీ డిపాజిట్లు కోల్పోవడం విశేషం, దీనిని బట్టి చూస్తే క్షేత్రస్ధాయిలో వైకాపా పార్టీ ఇంకా కోలుకోలేదనే సంకేతాలిస్తుంది. అలాగే నారా లోకేష్ ఈ విజయం పట్ల హర్షం వెల్లిబుచ్చారు, గత 30సంవత్సరాలుగా అప్రజాస్వామికంగా గెలుపొందుతున్న వారికి ఈ ఏన్నిక చెక్ పెట్టినట్లు పేర్కొన్నారు. గెలుపొందిన ఇరువురు అభ్యర్ధులు లతా రెడ్డి, క్రిష్ణా రెడ్డిలకు అభినందనలు తిలిపారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమి పాలవడంపై ఈ ఏన్నికల నిర్వహణలో ఏన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందిందని వ్యాక్యాణించారు.