ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం త్వరితగతిన పూర్తిఅయ్యి భారత దేశం లో మరో గొప్ప రాజధాని గా వెలుగొందలని ఇటీవల తిరుమల శ్రీవారిని ప్రారంభ సమయంలో దర్శించుకొని కోరినట్లు తమిళనాడు తెలుగు యువశక్తి వ్వవస్థాపక అధ్యక్షుడు మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు వారా ప్రకటన లో “రాభోయే రోజుల్లో అటు భారతదేశమే కాకుండా తెలుగు వారి రాష్ట్రాలైన అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి ని సాధించి దేశంలోనే తెలుగు రాష్టలు వెలుగొందాలని, అలాగే తమిళనాడు లో త్వరలో జరుగు ఎన్నికల్లో తెలుగు వారికి అండదండగా ఉండే రాజకీయ పార్టీ విజయం సాధించాలని తాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు తిరుమల లోని జపాలి ఆంజనేయస్వామి ఆలయం ను కూడా వారు దర్శించుకొని వారని కోరినట్లు అలాగే ఆయన ముఖ్యంగా వివాదాలలో, సమస్యలలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ యొక్క సమస్యలన్నిటిని నెరవేర్చి ప్రపంచంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమ రాబోయే కాలంలో దశదిశలా వెలుగొందాలని, పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ తొలగి పోవాలని వెంకన్నను, జపాలి ఆంజనేయ స్వామిని మొక్కుకొన్నానని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.