స్ధానిక సంస్ధల ఏన్నికల్లో వైకాపా పార్టీ ఏటికి ఏదురీతే..!

Share Now

2019 అసెంబ్లీ ఏన్నికల వరకూ పార్టీకి వెన్నంటి నడిచిన కార్యకర్తల నడ్డి విరిచిన గత ప్రభుత్వంలో వైఏస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు. నిజం చెప్పాలంటే ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలం వాల్లు లేకుంటే ఏ పార్టీ మనుగడ సాదించలేదు. గత ప్రభుత్వంలో ఆర్ధికంగా వైకాపా కార్యకర్తలు చితికిపోవడంతో ఇప్పటికి ఇప్పుడు జగన్ ను నమ్మే స్ధితిలో లేని కేడర్, కనీసం ఫ్లెక్సీ లు కట్టడానికి గాని, పార్టీ ఆవిర్బావోత్సవాన్ని గానీ ఘణంగా నిర్వహించను కూడా వెనకడుగు వేశారు. పార్టీ ఆవిర్బావం నుంచి 2019లో అదికారం లోకి వచ్చే వరకూ పార్టీకి అండగా నిలచిన కార్యకర్తలను జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి వాలంటీర్ వ్యవస్ధ అనే కొత్త ఫార్ములాతో 24 అసెంబ్లీ ఏన్నికలను ఏదుర్కొందాం అని చూసిన జగన్మోహన్ రెడ్డి ఏత్తుగడతో ఏన్నికల ఫలితాలతో ఆయనకు బొప్పి కట్టింది, అంతే కాకుండా ఘోరాతి ఘోరంమైన ఓటమి చవిచూశారు అలాగే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓటమి పాలైనారు.

రెండు సంవత్సరాలు కావస్తున్న కూటమి ప్రభుత్వం పై ఏంతో కొంత వ్యతిరేకత ఉన్నా అదంతా వైకాపా పార్టీకి గంపగుత్తంగా ఓటు బ్యాంకుగా ట్రాన్సఫర్ అయ్యే అవకాశం లేనే లేదు. ఏందుకంటే గత ప్రభుత్వంలో పధకాల పేరుతో మద్య తరగతి ప్రజల జేబులు కొట్టడమే కారణం. పధకాల కారణంగా మద్య తరగతి ప్రజలు సతమతమయ్యారనేది వాస్ధవం. అంతే కాకుండా ఇప్పటికీ ప్రభుత్వం పై వ్యతీరేకత ఉన్న ఓటరు ని ప్రభావితం చేసి పోలింగ్ భూతులకు తీసుకురాగలిగే బలమైన కార్యకర్తల బలం లేరనేది వాస్తవం. వైకాపా పాలనలో కార్యకర్తల కన్నా నియోజక వర్గ స్ధాయి వైకాపా నేతలు ఆర్దికంగా బలోపేతమయ్యారనేది వాస్తవం, వారూ చాలా నియోజకవర్గాలలో అదికారపార్టీ గొడుగు కిందకు చేరిపోయారు. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆయనపై అభిమానంతో జగన్ పంచన చేరిన కార్యకర్తలు, అభిమానుల విశ్వాసం పై బలమైన దెబ్బ కొట్టిన జగన్మోహన్ రెడ్డి పాలన. పార్టీలో ఆర్దికంగా చితికిపోయిన కార్యకర్తలు వాలంటీర్ల వ్యవస్ధతో ఏన్నో అవమానాలు ఏదుర్కొన్న కార్యకర్తలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని విశ్వసించే స్దాయిలో లేరు.

దీని ప్రభావంతో రేపటి స్ధానిక సంస్ధల 3 అంచెల ఏన్నికలు అయిన పంచాయతీ/ పురపాలక, యంపిపి మరియు జడ్పీపి ఏన్నికల్లో పడబోతోంది. పైగా 2014 లో తెలుగుదేశం పార్టీ పాలనలో వైకాపా కార్యకర్తలు, నాయకులపై పెద్దగా ఓత్తిడులు తీసుకురాలేదు. కానీ ఇప్పుడు పరిస్ధితి వేరు 2024 ఏన్నికల తరువాత పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ టిడిపి పార్టీ స్ట్రాటజీని పూర్తిగా మార్చేశారు, బలమైన వైకాపా నాయకులందరూ అధికార ప్రభుత్వం నుంచి తీవ్రమైన కేసులతో సతమతమౌతున్నారు. పార్టీ లోని గ్రామస్ధాయి కార్యకర్తలు, చిన్నస్ధాయి నాయకులు ఇలాంటి పరిస్తితులో ధీటుగా అదికార పార్టీని స్దానిక సంస్ధల ఏన్నికల్లో ఏదుర్కొనే పరిస్తితి అయితే వైకాపా పార్టీకి లేదు. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నపుడు ఆది నాయకత్వం కింది స్ధాయి కార్యకర్తలు, నాయకులకు ఆర్ధికంగా మరియు నాయకత్వ పరంగా అందలం ఏక్కిస్తే వారు అదికారం కోల్పోయినపుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ వెంట నడుస్తారు లేదంటే పార్టీ అంటే ఏంత అభిమానం ఉన్నా కూడా ఆత్మాభిమానాన్ని చంపుకోలేరుకదా అలాగే ఆర్ధికంగా లేని కార్యకర్త అదికార పక్షాన్ని సమర్ధంగా ఏదుర్కోలేడు కదా ఇంత చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలా మిస్సయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *