అమెరికాలో, భారత్ వస్తు దిగుమతులపై 50% సుంకం విదించిన దరిమిలా భారత్ లో మొధలైన అమెరికా వస్తువుల భహిష్కరణ. 1905 లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంపై మొదలైన స్వదేశీ పర్వం ఇప్పుడు మరలా దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. మొదటగా లవ్లీ ప్రోఫెషనల్ యూనివర్సిటీ ప్రాంగణంలో అమెరికా సంస్ధ లైన కోకో కోలా, పెప్సీల విక్రయాలపై నిషేధం విధించినట్లు యూనివర్సిటీ వ్యవస్ధాపకులు మరియు చాన్సిలర్ అలాగే రాజ్యసభ సభ్యులు కూడా అయినటువంటి డా. అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. అప్పట్లో బాలగంగాధర్ తిలక్, లాలా లఝపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ స్వదేశీ జాగరణ్ మంచ్ కు పిలుపు నిచ్చిన స్పూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.