జగన్ ఇజ్జత్ తీసిన…… మావి గన్ వ్యాఖ్యలు

Share Now

గత ప్రభుత్వం లో తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రిగా పని చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, పార్లమెంటులో అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించడంపై జరిగిన తదనంతరం పాత్రికేయుల ముఖాముఖిలో తెరపైకి కొత్తగా మచిలీపట్నం(MA), విజయవాడ(VI), గుంటూరు(GUN) తో కలిపి మావి గన్ అనే కొత్త రాజధాని ప్రాంతాన్ని తెరపైకి తీసుకురావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది అలాగే వైకాపా పార్టీలోని సీనియర్ నాయకులను సైతం ఒకింత విస్మయానికి గురి చేసింది.

ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిపక్వతను మరియు రెండు నాలుకల ధోరణిని ప్రశ్నించే విధంగా ఉన్నది. ఈ బిల్లు పార్లమెంటులో లోక్ సభ యందు చర్చకు రాగా వైకాపా పార్టీ పార్లమెంటు సభ్యులు అందరూ తమ పార్టీ నినాదంగా మూడు రాజధానులు కట్టుబడి ఉంటాం అని పార్లమెంటు సాక్షిగా నినదించారు, కానీ ఇక్కడ వైయస్ జగన్ గారు మాత్రం ఓ కొత్త రాజధాని ఫార్ములా ను తెరపైకి తీసుకొని వచ్చారు అదే మావి గన్. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రుల రాజధాని పట్ల వైసిపి సభ్యుల నినాదం ఒకటి ఇక్కడ పార్టీ అధ్యక్షుల వారి వైఖరి వేరా అని రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కుపై వేలు వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మూడు రాజధానుల మంత్రం జపించగా పదవి పోయాక మావి గన్ పేరుతో ఓ కొత్త నాటకానికి తెర తీశారా అనే చర్చ ప్రజలలో జరుగుచున్నది. గత వైసిపి ప్రభుత్వంలో తెరపైకి తీసుకువచ్చిన 3 రాజధానుల నినాదం అప్పటి అమరావతి రైతుల పాలిట శాపం గా మారినది, తదుపరి వీరు హైకోర్టును ఆశ్రయించగా వారికి అప్పట్లో తాత్కాలిక ఉపశమనం కలిగినది. ఇప్పటికీ రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు కావస్తున్న ఇంకా కూడా రాజధాని ఏర్పాటుపై ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో స్పందించడం పుష్కలమైన సహజ సంపద, భౌగోళిక మైన ఏర్పాటు, సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంత మరియు అశేషమైన మానవ సంపద ఉన్నటువంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శరాఘాతం లాంటిది. కనుక అన్ని పార్టీలు రాజకీయ భేషజాలు పక్కన పెట్టి అమరావతి రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి ఆంధ్రుల భవిష్యత్తుకు నాంది పలకాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *