సస్పెన్స్ క్రైమ్ ధ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా మధ్యప్రధేశ్ రాష్ట్రం, ఇండోర్ కి చెందిన రాజా రఘువంశీ దారుణ హత్యోదంతం, ఏట్టకేలకు ఉత్తర్ ప్రధేశ్ పోలీసులకు ఘాజీపుర్ నందు ఓక డాబాలో లొంగిపోయిన సోనమ్ రఘువంశీ వయస్సు 26 సంవత్సరాలు. చేయి పట్టుకుని ఏడు అడుగులు నడచి జీవితాంతం కలసి ఉండాల్సిన భార్యే భర్త పాలిట యమ పాశం గా మారింది. తన సహ ఉద్యోగి రాజ్ కుష్వాహ మరో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్ లతో కలసి ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో ఓప్పుకున్న సోనమ్, తన సహా ఉధ్యోగి రాజ్ కుష్వాహ తో సన్నిహిత సంభందం కారణంగా వీరు ఇద్దరూ మరో ముగ్గురు ఇండోర్ కి చెందిన కాంట్రాక్ట్ కిల్లర్స్ ఆనంద్ కూర్మి, ఆకాశ్ రాజ్ పుట్, విశాల్ ఛౌహాన్ లతో కలసి రాజా రఘువంశీ హత్య కుట్రకు తెరలేపారు. మేఘాలయలో హానీమూన్ కి వచ్చిన కొత్త జంట, రాజా రఘువంశీ కిరాతకంగా తలపై బలమైన గాయాలతో హత్య కావించబడినాడు. ఈ అయిదుగురు నేరగాల్లను ట్రాన్సిట్ వారెంట్ పై షిల్లాంగ్ తరలిస్తున్న మేఘాలయ పోలీసులు, ఇక్కడ వీరితో నేరం జరిగిన ప్రదేశంలో సీన్ రీకన్ష్ట్రక్షన్ చేయనున్నారు.