ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 4 ప్రత్యేక వాణిజ్య మండలిలు(SEZ) మరియు ఓక పోర్టు ఉన్నాయి అలాగే తమిలనాడు రాష్ట్ర సరిహద్దు జిల్లా. పోర్టు ఆధారితంగా అనేక పరిశ్రమలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఇందులో అనేక మంది కాంట్రాక్ట్ లేబర్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పనుల్లో ఉన్నారు. ముత్తుకూరుకు చెందిన శ్రీరాములు వెంకటేశ్వర్లు ఏప్రియల్ నెల 30వ తారీకున ప్రధాన మంత్రి గారికి తన విన్నపాన్ని పంపారు. ఉపాది పేరుతో ప్రజలు వివిధ రాష్ట్రాల నుండి అలాగే సరిహద్దు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్ధాన్, బర్మా ల నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు స్ధానికంగా పలు పరిశ్రమలలో కాంట్రాక్ట్ లేబర్ గా ఆశ్రయం పొందతున్నట్లు అలాగే కార్మీక చట్టం అమలులో స్ధానికులకు 50% ఉపాది కల్పించ వలసి ఉన్ననూ దీని గురించి స్ధానిక కార్మీక శాఖ అధికారులు పట్టించుకోక పోవడాన్ని, నేర చరితులు అలాగే పాకిస్ధాన్, బంగ్లాదేశ్, నేపాల్, బర్మాల నుంచి వచ్చిన పలువురు అక్రమ చొరబాటు దారులు వివిధ పరిశ్రమలలో మరియు హోటల్లలో ఉపాది ఆశ్రయం పొంది తరువాత వీరు ఇక్కడ స్ధిర నివాస ధృవీకరణ పత్రాలు పొందుతున్నారు ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు మరియు ప్రభుత్వాలు అందించే పలు పధకాలు అందుకొంటున్నట్లు తన పిర్యాధులో ప్రధాన మంత్రి కార్యాలయానికి తెలియజేశారు. ఈ పిర్యాదు ఆధారంగా ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఆధేశాను సారం నెల్లూరు జిల్లా పోలీసు సూపరింటెండ్ వారు ఈ ఫిర్యాధు పై పరిశీలన జరిపి తగు చర్యలు తీసు కొనుచున్నారు.