రాష్ట్రంలో కొత్తగా ఏడు PMNDP డయాలసిస్ సెంటర్లు

Share Now

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఏడు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ గారు, వీటిని కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం పథకము కింద రాష్ట్రానికి కేటాయించినట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్లను రాష్ట్రంలో S కోట, (విజయనగరం జిల్లా), భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా), పీలేరు (చిత్తూరు జిల్లా), సీతంపేట (పార్వతీపురం మన్యం), వెంకటగిరి (SPSR నెల్లూరు జిల్లా), అద్దంకి (బాపట్ల జిల్లా), సున్నిపెంట (నంద్యాల జిల్లా) లలో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క సెంటర్ కి గాను 75 లక్షల రూపాయలు విలువగల మూడు అత్యాధునిక డయాలసిస్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు, ఒక్కో సెంటర్లో రోజుకు 15 మంది డయాలసిస్ పేషెంట్లకు చికిత్సను అందించనున్నారు. ఇదివరకే రాష్ట్రంలో గల 232 డయాలసిస్ సెంటర్లకు గాను ఇవి ఏడు అధనం దీనితో మొత్తం 239 డయాలసిస్ సెంటర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేషెంట్లకు చికిత్సను అందించనున్నారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వీటి నిర్వహణను ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ (PPP) మోడల్ విధానంలో నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *