నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ లేఅవుట్ లలో పబ్లిక్ యుటిలిటీ పార్కులు, ఇతర అవసరాలకు వదలవలసన స్ధలాలను ఆ యొక్క లేఅవుట్ మధ్యలో అందరికీ ఉపయోగ పడేలా తీసుకోవాలి కానీ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటి కొన్ని లేఅవుట్లలో పనికిరాని క్రాస్ స్ధలాలను ప్రజల సాకర్యార్ధం వినియోగానికి కేటాయించినారు. దీని వల్ల రియాల్టర్లకు లభ్ధీ చేకూరుతుంది, ఏ లేఅవుట్ లో అయినా క్రాస్ ప్లాట్లలను కొనుగోలుదారులు కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపరు వీటిని నూడా పబ్లిక్ యుటిలిటీ కి కేటాయించడంలో ఏదైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై లేదా నూడా అధికారులు నిభందనలను అతిక్రమించారా అనే దానిపై విజిలెన్స్ విచారణ జరిపి కొనుగోలు దారుల హక్కులకు ఇకపై నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదు. అలాగే లేఅవుట్ల నిభంధనల ప్రకారం మార్టుగేజ్ చేయబడిన స్ధలాలు కూడా ఓక మూలన ఉండడం రేపు రియాల్టర్ ఏదైనా చేతులు ఏత్తేస్తే మూలన తీసుకోబడిన ప్లాట్ల వల్ల వినియోగదారులకు ఓనగూరే ప్రయోజపం ఏంటి.
ఏదైనా లేఅవుట్ అనుమతి పొందిన తరువాత దాని పూర్తి డెవలప్మెంట్లకు కాలపరిమితి 3సంవత్సరాలు ఉంటుంది, కానీ దీనిని తుంగలో తొక్కి అనుమతి పొందిన వెంటనే ఏలా రిజిష్ట్రేషన్లకు NUDA అనుమతిస్తున్నారు ఇది రియాల్టర్లకు కొమ్ముకాయడం కాదా. కాలపరిమితిని దాచి వినియోగదారులకు రిజిష్ట్రేషన్లలో తెలుపని రియాల్టరు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న నూడా అదికారులు. కనీసం నూడా అయినా సధరు లేఅవుట్ యొక్క వివరాలు కాలపరిమితి తదితరాలు లేఅవుట్ నందలి ఏర్పాటు చేస్తే బావుంటుంది.