ఈ మద్య వెస్ట్ బెంగాల్ పోలీసులు గురుగ్రామ్ నందు అరెస్ట్ చేసిన షర్మిష్టా పనోలి అనే లా విధ్యార్ధిని ఆపరేషన్ సింధూర్ సమయం లో ఓక వర్గాన్ని కించ పరిచే విధంగా మాట్లాడారనే నేరంపై పలు సెక్షన్ల పై రిమాండ్ లో ఉన్నారు. అదే కేసులో కంప్లైన్ దారుడైన వజాహత్ ఖాన్ ని కూడా ఈ రోజు కొల్ కత్తా, అమ్హ్రెస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై గల్ఫ్ గ్రీన్ పోలీస్ స్టేషన్ పరిదిలో భారత న్యాయ సంహిత 196(1)(A),299, 352, 353(1)(C) సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ కాబడినది. తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా హిందూ మత సాంప్రధాయాలకు భంగం కలిగించే విధంగా పలు సోషల్ మీడియాలో పోస్ట్ లను చేసియున్నారు. దీనిపై ఇతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.