భారత ప్రధాన న్యాయమూర్తి పై బూటు విసిరిన న్యాయవాది

Share Now

భారత అత్యున్నత న్యాయ స్ధానం, హాల్ నంబర్ 1, నందు భారత ప్రధాన న్యాయమూర్తి పై బూటు విసిరిన న్యాయవాది. రాకేష్ కిషోర్ అనే న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ B.R.గవాయ్ పై తన బూటును విసరారు, వెంటనే కోర్టు మార్షల్స్ సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు, న్భాయవాది భారతదేశంలో సనాతన ధర్మం వర్ధిల్లాలి అనే నినాదం చేశారు. సదరు వ్యక్తి, మధ్యప్రదేశ్ లోని కజురహో ఆలయం నందలి విరిగిన 6 అడుగుల మహా విష్ణు విగ్రహం తిరిగి ప్రతిష్టాపణ చేయాలి అనే దాని ప్రజా ప్రయోజన పిటిషన్ పై గతంలో CJI చేసిన ఇది ఓక ఫబ్లిసిటీ పిటీషన్ అనే ఘాటు వ్యాఖ్యలకు నిరసనగా ఇలా ప్రవర్తించారని తెలియవచ్చింది.
CJI ఈ ఘటనపై ఏటువంటి తదుపరి చర్యలు వద్దని సుప్రింకోర్టు రిజిష్ట్రార్ ని ఆదేశించడం జరిగింది, తదుపరి లాయర్ రాకేష్ కిషోర్ ని విడుదల చేశారు.
ఈ ఘటనతో న్యాయ వ్యవస్ధ అంతా నిర్గాంత పోయింది. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడి ఫోనులో CJI B.R. గవాయ్ గారితో సంభాషించి సంఘటనకు సంభందించిన వివరాలు తెలుసుకొన్నారు, అలాగే ఆయన ఇలాంటి ఘటనలు జరగడం దురధృష్టకరం అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *