హైదరాబాద్ ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన వ్యవస్ధాపకురాలు కల్వకుంట కవిత గారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో లోపాలు, అవినీతి పై ఏర్పాటైన విచారణ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి నోటీసులు ఇవ్వడంతో కవిత ఈ ధర్నాను చేపట్టారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తరువాత అనేక నీటి ప్రాజెక్టులతో వ్యవసాయానికి సాగు నీరు అందించిన కెసిఆర్ ని కాంగ్రేస్ ప్రభుత్వం విచారణల పేరుతో వేదిస్తున్నట్లు కవిత తెలిపారు.