గరుడ వారధి నిర్వహణ గాలికి వదిలేశారా…???

Share Now

“కళావిహీనంగా మారిన “గరుడ వారధి”…

గరుడ వారధి నిర్మాణ కాంట్రాక్టర్ ఫ్లైఓవర్ నిర్వహణ(MAINTANENCE) సక్రమంగా చేస్తున్నారా అన్న అనుమానాలు తిరుపతి నగర ప్రజలలో కలుగుతున్నది గరుడ వారధి నిర్వహణ లోపం కారణంగా ట్రాఫిక్ సమస్యలతో యాత్రికులకు, ఇటు నగర ప్రజలకు శాపంగా మారింది. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారు తిరుపతి పవిత్రతను దృష్టిలో ఉంచుకొని యాత్రికులు మరియు నగర ప్రజల సౌకర్యార్థం గరుడ వారధికి పునాది రాయి వేశారని, హైదరాబాద్ “నెక్లెస్ రోడ్” తరహాలో విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా ఉండాల్సిన గరుడ వారధి కళా విహీనంగా మారడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

గరుడ వారధి 2019లో 694 కోట్లతో ప్రారంభమైందని అందులో 600 కోట్లు ఫ్లైఓవర్ కు, 90 కోట్లు స్మార్ట్ స్ట్రీట్స్, మెయింటెనెన్స్, కాలువల నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది.గరుడ వారధి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ISO (INTERNATIONAL ORGANISATION FOR STANDARDISATION) THIRD PARTY CERTIFICATE ద్వారా ROAD & SAFETY AUDIT జరిపించాల్సిన బాధ్యత టిటిడి, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ అధికారులపై ఉన్నా అలాంటి భద్రతా పరీక్షలు జరిగిన దాఖలాలు కనపడటం లేదు. గరుడ వారధికి రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిగితే వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు పడినప్పుడు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగినప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణంలో ఏదైనా చిన్నచిన్న పొరపాట్లు ఉంటే గుర్తించి వెంటనే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. గరుడ వారధి ఫ్లైఓవర్ కింద ఉన్న లీలామహల్ నుంచి లక్ష్మీపురం కరకంబాడి సర్కిల్ పద్మావతి పురం పైభాగం వరకు ఉన్న జంక్షన్ల, డివైడర్ల బ్యూటిఫికేషన్ నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్ దే అయినా గాలికి వదిలేసారని డివైడర్ల మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడంతో కళావిహీనంగా దర్శనమిస్తుంది.

గరుడ వారధి 5 సంవత్సరాల నిర్వహణ కొరకు సుమారు 25 కోట్లతో అదే కాంట్రాక్టర్ కు అప్పజెప్పడం అందులో కొంత నిధులు విడుదల చేయడం జరిగినా నిర్వహణ లోపం కారణంగా ట్రాఫిక్ సమస్య పెరగడం నగర ప్రజలకు యాత్రికులకు శాపంగా మారింది. తిరుపతిలో వర్షం పడితే గరుడ వారధి ఫ్లైఓవర్ కింద ఉన్న ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయని దానికి కారణం కాలువ నిర్మాణాలను చేపట్టకపోవడమే.టిటిడి నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ గరుడ వారధి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం ISO (international organisation for standardization) (THIRD PARTY CERTIFICATE) సర్టిఫికెట్ తీసుకొని 5 సంవత్సరాలు సక్రమంగా పూర్తి నిర్వహణ చేపట్టేలా ఆదేశాలిచ్చి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *