మొదలైన మూడో ప్రపంచ యుధ్ధం…

Share Now

అమెరికా ఇరాన్ కు చెందిన మూడు అణు స్ధావరాలు ఫోర్డవ్, ఇష్ఫహాన్, నటాంజ్ లపై జరిపిన ఆకస్మిక ధాడులతో, తారాస్ధా యికి చేరిన ఇరాన్, ఇజ్రాయెల్ మద్య యుధ్ధం. అమెరికా ఇరాన్ అణు స్ధావరాలపై ధాడుల తరువాత అక్కడ ఏలాంటి రేడియో ధార్మిక విడుదల లేకపోవడంతో ఇలాంటి దాడిని ముందుగానే ఊహించిన ఇరాన్ రేడియో ధార్మిక నిల్వలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. దీనిని ఇరాన్ దేశం అధికారికంగా కూడా ధృవీకరించడం జరిగినది. అమెరికా ధాడుల తరువాత ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ పై 30కి పైగా ఖండాంతర క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. తదనంతర పరిమాణాలతో ఇరాన్ రక్షణ మంత్రి రష్యా చేరుకున్నారు. ఇరాన్ సుప్రీమ్ కమేని మాట్లాడుతూ అమెరికా చర్యలు పర్షియన్ దేశాలలో అగ్ర దేశమైన ఇరాన్ యొక్క సార్వభౌమాదికారం పై సవాలు విసరడం లాంటిదేనని, దీనికి అమెరికా దేశం తగు మూల్యం చెల్లించ వలసిందేనని ఘాటుగా స్పందించారు. అలాగే అమెరికా చర్యల తరువాత ఈ యుద్దంలో రష్యా, చైనా దేశాలు కూడా కలుగజేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే పశ్చిమ ఆసియా ప్రాంతంలో భయాణక యుధ్ధ పరిస్ధితులు ఏర్పడి, అలాగే గల్ఫ్ దేశాలతో వాణిజ్య పరమైన అడ్డంకులు మరియు క్రూడ్ ఆయిల్ సంక్షోభం ఏర్పడి అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ పై పెను సవాల్ విసిరే అవకాశం ఉన్నది, అలాగే ఇది మూడో ప్రపంచ యుద్దంగా కూడా మారే సూచనలు కనిపిస్తున్నవి. ఇంత జరుగుతున్నా ఐక్యరాజ్య సమితి ది ప్రేక్షక పాత్రగా మాత్రమే గా కనిపిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *