ప్రపంచ పర్యావరణ ధినోత్సవం సంధర్బంగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ సంస్ధ మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో తుల్లూరు లో ఏర్పాటైన ప్లాస్టిక్ రహిత వస్తువులు, బయో డీగ్రేడబుల్ వస్తువుల ప్రధర్శనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ గారు కలిసి తిలకించినారు. అలాగే వన మహోత్సవ ప్రధర్శన కార్యక్రమంలో పర్యావరణ రక్షణకు ప్రజలు నడుము బిగించాలని పిలుపునిచ్చారు అలాగే మహిలలు “సీడ్ రాఖీ” ద్వారా పర్యాపరణ పరిరక్షణకు పాటు పడాలని ఆడబిడ్డలకు పిలుపునిచ్చారు. మీ సోదరుల జన్మ నక్షత్రానికి తగిన చెట్టు విత్తనాలతో రూపొందించిన ‘సీడ్ రాఖీ’ని కట్టమని ఆడబిడ్డలను కోరారు, మీరు కట్టే సీడ్ రాఖీ తరువాత కాలంలో నేల తల్లిని చేరి మొక్కగా మారుతుందని, ఇది మీ అన్నదమ్ములకు శుభం చేకూర్చడమే కాదు పర్యావరణానికి హితంగా కూడా ఉంటుంది అని తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతమైన అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొని కోటి మొక్కల వన మహోత్సవాన్ని ప్రారంభించారు. వచ్చే పర్యావరణ దినోత్సవం నాటికి రాష్ట్రంలో ఐదున్నర కోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సంకల్పించామని తెలియజేశారు. దీనికి ‘సీడ్ రాఖీ’ కార్యక్రమంతో మద్దతివ్వాలని మహిళలకు విన్నవిస్తున్నాను అని పిలుపునిచ్చారు.