నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, సుమారుగా 60 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన గావించినారు. అమరావతి నగర పునర్నిర్మాణంలో కేంద్రం తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేయనున్నట్లు ప్రధాని తెలిపారు. అమరావతి ఒక నగరం కాదు అది ఒక శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అని కొనియాడారు. పూర్వము అమరావతి నగరం భారతదేశ సంసృతి, సాంప్రదాయాలకు మరియు బౌద్ధ మతానికి ప్రతీక అని తెలిపారు, అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని మరియు AI శాస్త్ర సాంకేతికత శోభాయమానం కలిగిన రాజధాని నగరం గా విరసిల్లుతుందని అన్నారు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఓ విజనరీ ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ ఆయన నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ పురోభివృద్ధి సాధిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోవడం విశేషం.
