వైకాపా రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి మధ్యంతర రాజీనామా తో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీలో భాగంగా, ఉపఎన్నికల్లో ఈ స్థానాన్ని మిత్ర పక్షమైన భాజపా పార్టీకి కేటాయించిన తెలుగుదేశం పార్టీ.
ఈ స్థానం నుండి అనేక ఊహాగానాల మధ్య ఎట్టకేలకు తెరపైకి వచ్చిన పాక వెంకట సత్యనారాయణ గారి అభ్యర్థిత్వం, ఆయన స్వస్థలం భీమవరం, 1976 నుంచి బలమైన ఆర్ఎస్ఎస్ భావజాలం గల కార్యకర్తగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ భాజపా క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు, ఈయన మరో రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా పదవిలో కొనసాగనున్నారు.