జిల్లా వ్యాప్తంగా నేరాల నివారణకు ప్రకాశం పోలీసుల ప్రత్యేక తనిఖీలు లాడ్జీలు, డార్మిటరీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ V. హర్షవర్ధన్ రాజు IPS, గారి ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పలు లాడ్జీలు, డార్మిటరీలు మరియు ఇతర వసతి ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లాడ్జీలు, డార్మిటరీల్లో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, గుర్తింపు పత్రాలు, గెస్ట్ రిజిస్టర్లు, వాహనాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎటువంటి అసాంఘిక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావులేకుండా నిర్వాహకులకు వారు పలు సూచనలు చేశారు.
వసతి గృహాల నిర్వాహకులు ప్రతి వ్యక్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నేరాల నివారణకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.
