NECC మరియు మెప్మా ద్వారా ఏగ్ కార్టుల పంపిణీ.

Share Now

ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా వివిధ మున్సిపాలిటీలలో గల 40 స్వయం సహాయక సంఘాలకు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా ఎగ్ కార్ట్ లు అందజేయబడ్డాయి. పట్టణ జీవనోపాదుల మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ మెప్మా సంస్థ సంయుక్తంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్నది.

ఒప్పందం ప్రకారం ఆసక్తి కలిగిన ఏంపిక చేయబడిన అర్బన్ పొదుపు మహిళలకు శిక్షణతో పాటు అటుగా ఎగ్ కార్ట్, బర్నర్ స్టవ్, హాట్ బాక్సులు, డెక్ష మరియు స్టూళ్లు వంటి తదితర రూపాయలు Rs.50000/- విలువ కలిగిన సామాగ్రిని ఒక్కొక్కరికి NECC సంస్థ అందిస్తోంది. నెల్లూరు జిల్లాలో మొదటి దశలో 7 ఎగ్ కార్ట్ లు ఇవ్వగా, రోజు 40 ఎగ్ కార్లు ఈ పథకం ద్వారా ఉచితంగా అందజేయడం జరిగింది.

ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది అందులో భాగంగా విజయవాడలో 4 ఎగ్ కార్టులు, గుంటూరు నందు 5 ఎగ్ కార్టులు మరియు నెల్లూరు నందు 40 కార్టులను అందజేశారు. మెప్మా సంస్ధ వారు అందిస్తున్న ఈ పథకం ద్వారా అర్బన్ మహిళలు స్వయం ఉపాధితో పాటుగా ఆర్థిక స్వావలంబన, ప్రజలకు పౌష్టిక ఆహారమైన గుడ్లు ద్వారా ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు నారాయణ గారితో పాటు నెల్లూరు జిల్లా మెప్మా పధక సంచాలకులు M. కిరణ్ కుమార్, మెప్మా ఏఎండి K.N వెంకటేశ్వర రావు మరియు స్టేట్ మిషన్ మేనేజర్ NNR శ్రీనివాస్ గార్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *