నెల్లూరు: నేడు అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా మెప్మా అధికారుల నుంచి మరియు పొదుపు లీడ్ బ్యాంకుల అధికారుల నుంచి వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు, తమ సమస్యలను ఇదివరకే జిల్లా కలెక్టర్ వారికి మరియు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి పలుసార్లు విన్నవించి ఉన్నారు, అర్బన్ పొదుపు మహిళల సమస్యలు పరిష్కరించని పక్షంలో సెప్టెంబర్ 11వ తారీకున నెల్లూరులో గల సంబంధిత శాఖ మంత్రి వర్యులు అయినటువంటి పొంగూరు నారాయణ గారి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది అని ఐద్వా మహిళలు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి తెలిపారు. మెప్మా కార్యాలయ సిబ్బంది అయినటువంటి పలువురు అధికారులు లోన్లు ఇప్పించడంలో బ్యాంకు అధికారులతో కుమ్మక్కై సంఘాల నుండి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి విన్నవించుకున్నారు, అలాగే మెప్మా కార్యాలయంలో మూడు సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న పలువురు అధికారులు పనితీరు, దురుసు ప్రవర్తనపై పిడి గారికి విన్నవించుకున్నారు. అలాగే పొదుపు లోన్ లకు వసూలు చేస్తున్న డాక్యుమెంట్ చార్జీలను ప్రభుత్వమే భరించాలి అని కోరారు, పొదుపు మహిళలు నెల నెల లోను కిస్తీ చెల్లింపులకు సరాసరిన రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు అధిక వడ్డీలు చెల్లిస్తున్నట్లు అధికారి వారికి మొరపెట్టుకున్నారు.

ప్రధాన డిమాండ్లు:
*RP కనీస వేతనంగా 26000 రూపాయలు ఇవ్వాలి.
*53, 54 డివిజన్లో ప్రభుత్వ బ్యాంకును వెంటనే ఏర్పాటు చేయాలి.
*ఎన్నికల వాగ్దానం మేరకు పొదుపు మహిళలకు రుణమాఫీ చేయాలి.
*సూపర్ సిక్స్ హామీ ప్రకారం మహిళకు 1500 రూపాయలు ఇవ్వాలి.
*ప్రతి బ్యాంకులో పొదుపు పుస్తకం ఎంట్రీ వేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
*బ్యాంకు ద్వారా పొదుపు రుణాలు తీసుకున్న వారికి వడ్డీ మాఫీ సకాలంలో చెల్లించాలి.
*పొదుపు మహిళల పట్ల బ్యాంకు అధికారులు మెప్మా అధికారుల దురుసు ప్రవర్తనను అరికట్టాలి.
*స్లమ్ లెవెల్ ఫెడరేషన్ కు ప్రభుత్వం నుండి 25 లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ గా ఇవ్వాలి.
*యాప్ లలో నమోదు ఆన్లైన్లో నమోదు కార్యక్రమం పేరుతో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు ఆపాలి
*పొదుపు సంఘాల లోను లకు బ్యాంకులు నెల నెల వసూలు చేసే అధిక వడ్డీ విధానాన్ని అదుపు చేయాలి అని కోరారు.
*మహిళలకు ఉపాధి అవకాశాలు మరియు స్కిల్ ట్రైనింగ్ లు ఇప్పించాలి, నిరుద్యోగ భృతి క్రింద 3000 రూపాయలు ఇవ్వాలి.
*పొదుపు మహిళలు తీసుకున్న రుణానికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించాలి అలాగే సభ్యురాలు చనిపోయిన లేదా సభ్యురాలి భర్త చనిపోయిన ఇన్సూరెన్స్ మొత్తం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు N.V.సుబ్బమ్మ, అద్యక్షురాలు. కత్తి పద్మా, కార్యదర్శి పలు సమాఖ్యల ఆర్.పి లు, సమాఖ్యల అద్యక్షులు అలాగే పొదుపు మహిలలు పాల్గొన్నారు.
