ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించే హక్కు ఉందా: CJP ది రాజ ద్రోహమా..?

Share Now

న్యూఢిల్లీ : CJP పార్టీకి ఏదో ప్రచార ఆర్భాటం తప్ప భారత రాజ్యాంగం వ్యవస్థ నిర్మాణం గురించి సరి అయిన అవగాహన లేనట్లుగా తెలుస్తోంది. ఆర్టికల్ 324 ద్వారా స్థాపించబడిన భారత ఎన్నికల సంఘానికి ఎక్కడా లేనటువంటి విచక్షణ అధికారాలు ఉన్నాయి, ఈ ఆర్టికల్ ద్వారా వారు పార్లమెంట్ ఎన్నికలను మరియు అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నికలను అలాగే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలను నిర్వహించగలిగే స్వయం ప్రతిపత్తి కలిగి యున్నది దీనిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిర్వహిస్తారు. ఆర్టికల్ 324 పార్ట్ 15 ద్వారా వీరు ఎన్నికలను ఎలా నిర్వహించాలి అనేదాని పై కూడా విశిష్ట అధికారాలు కలిగి ఉంటారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వారి వ్యవహారాలలో జుడీషియల్ సిస్టం కూడా తల పెట్టలేదు, ఇంతటి విశిష్ట అధికారాలు కలిగినటువంటి భారత ఎన్నికల సంగం విధి నిర్వహణలో కాక్రోచ్ జనతా పార్టీ తల దూర్చడం అంటే అది వారి మిడిమిడి జ్ఞానానికి సంకేతం.

ఇదివరకే టి.ఎన్ శేషన్ లాంటి ఎలక్షన్ కమిషనర్లు ECI రాజకీయ వ్యవస్థల చేతిలో కీలుబొమ్మ కాదని దాని పవర్ ఏంటో ప్రత్యక్షంగా చూపించారు. రాజ్యాంగం బద్ధంగా విశిష్ట అధికారాలు కలిగిన కలిగినటువంటి రాజ్యాంగ బద్ధ సంస్థలపై సరి అగు ఆధారాలు లేకుండా నిందలు మోపడం రాజ ద్రోహమే వీరి వెనక ఉన్న రాజ్యాంగేతర శక్తులే CJP పార్టీని నడిపిస్తున్నాయి అని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వీరు భారత ఎన్నికల కమిషనర్ బేషరతు రాజీనామాకు 48 గంటలు తుది హెచ్చరిక ఇవ్వడం వెనుక ఏదైనా రాజ ద్రోహ కుట్ర దాగి ఉందా?. ఎందుకంటే ఈ పార్టీ ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొన్న దాఖలాలు లేవు, వీరికి ఎన్నికల సిస్టం గురించి ఎటువంటి అవగాహన కూడా లేదు ఇది ఒక సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన ఓ కుహనా రాజకీయ సంస్థ, CJP రాజీనామా పిలుపుతో వీరికి రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎంత నిబద్ధత ఉంది అనేది తేటతెల్లమవుతోంది. లోగడ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలోని చూసాం ఢిల్లీ వేదికగా వీరు చేసిన ఆగడాలు, రాజ్యాంగబద్ధ సంస్థల మీదే బురద జల్లడం అంటే వీరు ఎంత పార్టీ న్యాయ కోవిదులు అనేది అర్థమవుతుంది. కనుక భారత ప్రధాని మోడీ గారు తక్షణమే స్పందించి ఢిల్లీ నగరాన్ని మరలా భయభ్రాంతులకు గురి చేయకుండా ముందస్తు చర్యగా కర్ఫ్యూ లేదా కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని మరలా వీరు ఢిల్లీ వేదికగా ధర్నా పేరుతో చేపట్టబోయే అరాచకాన్ని నిరోధించి వారి ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *