మా నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా కోవూరు నియోజకవర్గం పరిధిలోని అన్ని స్థానాలలో వైకాపా పార్టీ పోటీకి సిద్ధం.ఈవీఎంల మహిమతో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం కి బుద్ధి చెప్పను స్థానిక సంస్థల ఎన్నికలలో బ్యాలెట్ ఓటు ద్వారా ప్రజలు తమ తీర్పుని ఇవ్వనున్నారు, మాకు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా పోలీస్ సూపరిండెంట్ వారు అంటే మాకు గౌరవం నమ్మకం, కానీ మండల స్థాయి అధికారులైన పోలీస్ అధికారులు మరియు రెవిన్యూ అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలలో మా వైకాపా నాయకులు పోటీ చేయకూడదు అని వారిపై బెదిరింపులకు అక్రమ కేసులు బనాయించడం మరియు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని పలువురు నాయకులకు బెదిరింపులు కొన్ని మండలాలలో పాల్పడుతున్నారు అని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు కోవూరు లో జరిగిన పార్టీ కార్యక్రమంలో అన్నారు.
దయచేసి చెబుతున్న టిడిపి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్టు మీరు డ్యూటీ చేయాలనుకుంటే అలాంటి సిఐలు, ఎస్సైలు ఎవరైనా ఉంటే కాకి యూనిఫామ్ తీసేసి పసుపు చొక్కాలు వేసుకుని డ్యూటీలు చేయండి. ఏ అధికారి అయిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే రాబోయేది వైసిపి ప్రభుత్వం ఏ అధికారిని వదిలిపెట్టం సప్త సముద్రాలు దాటి ఉన్న పట్టు కోస్తా నెల్లూరు ట్రంక్ రోడ్ సెంటర్లో మిమ్మల్ని నిలబెడతాం అన్నారు. అధికారం శాశ్వతం కాదు కానీ అధికారులు మాత్రం రిటైర్మెంట్ వరకు మీ సేవలు ప్రజలకు మాత్రమే అంతేకానీ అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తే మాత్రం ఈసారికి వచ్చే ప్రభుత్వంలో మీపై తీవ్ర పరిణామాలు ఉంటాయి అన్నారు . వైకాపా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా ప్రజలు ఓటు హక్కులు వినియోగించుకునే విధంగా అధికారులు వ్యవహరించాలని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా అధికారులను కోరారు.