ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టమైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతుండటం ఎన్నికల ఆలస్యానికి కారణం కాకూడదని కోర్టు తేల్చిచెప్పింది.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్బో బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఒకవేళ సవరించిన కొత్త ఓటర్ల జాబితా (SIR) అందుబాటులోకి రాకపోతే, ప్రస్తుతం ఉన్న పాత ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో వైకాపా పార్టీ స్ధానిక సంస్ధల ఏన్నికలపై అనుసరించిన ప్యూహం బెడిసి కొట్టింది.