చెన్నై: అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్–2026కు, ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ టి.ఎస్. జోసెఫ్ విజయ్ గారిని చెన్నైలోని ఆయన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ జి.ఎం.సి. హరీష్ బాలయోగి గారు, మరియు విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ శ్రీ కె. మురళి గారు కలిసి తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ టి.ఎస్. జోసెఫ్ విజయ్ గారికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.విజయవాడ ఉత్సవ్–2026కు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ఆహ్వానించినారు.