సరిహద్దుల వెంబడి పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాలకు సమాయత్తమవుతున్న ఇరు దేశాలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యల విషయంలో తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణం ఇక ఆసన్నమైనది. పెహల్గామ్ లో ఉగ్రమూఖల దుశ్చర్యలు కారణంగా 26 మంది హిందూ మత పర్యాటకులు అసువులు బాసిన తరువాత, ఇరు దేశాల మధ్య పూర్తిగా దెబ్బతిన్న దౌత్య పరమైన సంబంధాలు, ఇంకను సరిహద్దుల వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ సైన్యం దీటుగా స్పందిస్తున్న భారత్ బలగాలు.
ఇకపై భారత భూభాగంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఏట్టి పరిస్తితులలో సహించేది లేదు అంటున్న భారత ప్రధాన మంత్రి. ఆ దిశగా అడుగులు ఇందులో మొదటి ఎత్తుగడగా పాకిస్తాన్ తో ఉన్న 1960వ సంవత్సరంలో జరిగిన సింధు నది జలాల ఒప్పందం బేషరతు రద్దు మరియు భారతదేశంలో అనధికారికంగా నివసిస్తున్నపాక్ పౌరుల ఏరివేత, వాణిజ్య పరమైన ఎగుమతి దిగుమతుల పై ఆంక్షలు. ఇక రెండవ ఎత్తుగడగా వ్యూహాత్మకంగా అరేబియా మహాసముద్రం వెంట మరియు పాక్ సరిహద్దుల వెంబడి త్రివిధ దళాల మోహరింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నవి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి దీటైన జవాబు ప్రత్యక్ష యుద్ధమే సరి అంటూ ప్రపంచ దేశాలకు తన సంకేతాన్ని పంపిన భారత ప్రధాని.